సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి పవిత్ర పంచారామ సోమేశ్వర ఆలయం ఆవరణలో ఉన్న శ్రీ శివ సాయిబాబా దేవాలయం 14వ వార్షికోత్సవం నేడు, మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. సంకీర్తలు నిర్వహించారు. నేటి ఉదయం సాయిబాబా వారికీ పంచామృతాలతో అభిషేకాలు కు విశేషంగా భక్తులు హాజరు అయ్యారు. మద్యాహ్నన హారతి అనంతరం భక్తులకు పంచ భక్ష్య పరమణాలతో ప్రసాద వితరణ నిర్వహించారు. స్వర్గీయ కానూరి సింహాచలం, పాపాయమ్మ దంపతుల సంస్మరణార్ధం వారి కుటుంబీకులు అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. శ్రీ శివ సాయిబాబా ఆలయ కమిటీ అడ్జక్షులు నందమూరి శ్రీనివాస్, కార్యదర్శి యిర్రింకి సుబ్బారాయుడు,, కొఠారి మహేష్,తనలా రామకృష్ణ ఇతర సభ్యులు ఆధ్వర్యంలో విశేషంగా సాయి భక్తులు కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
