సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వరజనార్థన స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ క్రోధ ఉగాది నూతన తెలుగు సంవత్సర వేడుకలు లో భాగంగా శ్రీ స్వామివారిని దర్శించుకున్న కాకినాడ వాస్తవ్యులు శ్రీమతి కడలి దుర్గా రత్నం గారి మనుమడు చి.గుబ్బల సత్య సాత్విక్ పుట్టిన రోజు సందర్భముగా దేవాలయంలో నిత్యం భక్తులకు నిర్వహించే అన్నదానం ట్రస్ట్ నిర్వహణ నిమిత్తం రూ.50,232/-లు కానుకగా సమర్పించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి డీ రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
