సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం, భీమవరం సముద్ర తీరప్రాంతాలలో నేటి శనివారం నుండి ( ఏప్రిల్ 15 నుంచి) జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రతిఏటా ఈ సమయంలో చేపలు పునరుత్పత్తి సమయం సందర్భంగా సముద్రంలో మోటారు బోట్లు, యాంత్రీకరణ తెప్పలకు నిషేధ సమయంలో పూర్తిగా వేటను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే సంప్రదాయ తెప్పలు వేట సాగించుకోవాలి. ప్రభుత్వ నిషేధ సమయంలో మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ సర్కారు ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించనుంది. ఆదేశాలు విధిగా పాటించాలి. మత్య్సకార భరోసా కింద బోట్లు పరిశీలన చేసి దరఖాస్తులను ఆన్లైన్ నిక్షిప్తం చేసి తదుపరి, విచారణ చేసి మే 1న భరోసా తుది జాబితా ప్రకటిస్తారు. వచ్చే మే నెలలో సీఎం జగన్ మత్య కారులకు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *