సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని విష్ణు విద్యాసంస్థలలో గల శ్రీమతి బి. సీత పాలిటెక్నిక్ కళాశాల 27వ వార్షికోత్సవం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలుతో కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విష్ణు విద్యాసంస్థల చైర్మన్, KV విష్ణు రాజు, మాట్లాడుతూ.. రానున్న కాలంలో కంప్యూటర్ అవకాశాలతో పాటు సెమికండెక్టర్, ఆటోమొబైల్, ఏరో స్పేస్ వంటి రంగాలలో సాంకేతిక విద్య అభ్యసించిన వారికీ ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి రానున్నాయని అన్నారు. దానికి పునాది పాలిటెక్నిక్ విద్య ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన 2023 IES అల్ ఇండియా 5వ ర్యాంకర్ చినమిల్లి శివన్నారాయణ ను ఘనంగా సన్మానించారు. చినమిల్లి ,మాట్లాడుతూ విద్యార్థులు ఆర్థికంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా,తాను నిరుపేద కుటుంబం లో పుట్టి ఉన్నత చదువుల కోసం చిన్న చిన్న పనులు కూడా చేసి నేను ఈ స్థాయికి చేరనంటే దానికి కారణం శ్రీమతి బి. సీత పాలిటెక్నిక్ కళాశాల లో అధ్యాపకులు, యాజమాన్యం అందించిన సహకారం అన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు సంస్థల డైరెక్టర్ (అడ్మిన్) J.ప్రసాద్ రాజు, AGM రమేష్ రాజు , ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నేడు హోలీ పర్వదినం సందర్భముగా భీమవరం విషు మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో విద్యార్థినులు రంగులు చల్లుకొని,ఆటపాటలతో మిఠాయిలు పంచుకొని శోభాయమానం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *