సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్నపవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నకు నేడు, శుక్రవారం కేంద్ర భారి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ దంపతులు విచ్చేయగా ఆలయం మర్యాదలతో అర్చకులు వేదమంత్రాలతో స్వామివారి ఆసిర్వచనంతో స్వాగతం పలుకగా, దర్శనం తరువాత వేద ఆశీర్వదం తో పాటు శ్రీ స్వామివారి జ్ఞాపిక శేష వస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమం నందు జిల్లా దేవదాయ శాఖ అధికారి ఇ.వి.సుబ్బారావు పాల్గొనియున్నారు.
