సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలో వైద్యరంగంలో అత్యంత ఆధునిక వైద్య టెకనాలజీ తోపాటు సమర్ధవంతమైన వైద్యులను కలిగిన భీమవరం జేపీ రోడ్డులోని భీమవరం హాస్పిటల్స్ లో నేటి, గురువారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అత్యాధునిక ఎకోసైన్స్ ఫైబ్రోస్కాన్ (లివర్ స్కాన్ )స్మార్ట్ సి -ప్లస్ టెక్నాలజీ, ఒలింపస్ 190 సిస్టం లను, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ , హైదరాబాద్ AiG హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి అత్యాధునిక పరీక్ష పరికరాలను వర్చువల్ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భీమవరం డాక్టర్స్ నుద్దేశించి మాట్లాడుతూ.. తాజగా ఏర్పాటు చేసిన ఈ ఆధునిక వైద్య ఆవిష్కరణతో కడుపులో అజీర్తి , గ్యాస్, క్రొవ్వు శాతం, కాలేయంలో ను రాబోతున్న వ్యాధులు ఆరోగ్య సమస్యలను చాల ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలతో ఆరోగ్యంగా జీవించవచ్చునని అన్నారు. భీమవరం హాస్పిటల్స్ వైద్యులు సీనియర్ డాక్టర్, చైర్మన్ డాక్టర్ గోపాల రాజు ,మేనేజింగ్ డైరెక్టర్ కె.వి క్రృష్ణంరాజు లతో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకొని వారి సమర్ధతను అభినందించారు. వైద్య చికిత్సలతో పాటు, రోగులు సమతుల్య ఆహారం, అవసరమైన శరీరక వ్యాయామం, యోగ చెయ్యడం ద్వారా ఆరోగ్యంను పరిరక్షించుకో వచ్చునన్నారు . తదుపరి, భీమవరం హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వి. ఎస్. శ్రీనివాస్, చైర్మన్ డాక్టర్ జి. గోపాలరాజు ,మేనేజింగ్ డైరెక్టర్ కేవీ కృష్ణంరాజులు మాట్లాడుతూ.. ఫైబ్రోస్కాన్ ద్వారా లివర్ (కాలేయం)యొక్క ఆరోగ్య పరిస్థితిని చాల కచ్చితంగా తెలుసు కోవచ్చు నన్నారు అలాగే olympus 190 సిస్టం ఐ డెఫినిషన్ ఎండోస్కోప్స్ ద్వారా కొలనోస్కోపి ,ఇ.ఆర్ .సి.పి ల ద్వారా కడుపు చిన్న ప్లేగులు, పెద్ద ప్రేగులను పరీక్షించి అత్యధిక నాణ్యతతో స్పష్టమైన డిజిటల్ క్వాలిటీ ఫొటోలతో ప్రాథమిక దశలోనే అన్ని వ్యాధులను గుర్తించవచ్చాన్నారు , దెబ్బతిన్న భాగాలను, పుండ్లను, క్యాన్సర్ ను కూడా నిర్ధారణ చేయవచ్చని,గాల్ బ్లాడర్ లు పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో, వివిధ వైద్య విభాగాలకు చెందిన వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు
