సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో 3 టౌన్ లోని హోసింగ్ బోర్డు లో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో నేడు ఉదయం కార్తీక దామోదర పూజ ను అల్లం నాగ వెంకట రమేష్, సత్యవతి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవేరులతో స్వామివారిని విశేషంగా భక్తులు దర్శించుకొన్నారు. తదుపరి కార్తీక వన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచభక్ష పరమణలతో గుడి ఆవరణలో ఉన్న స్థలంతో పాటు అక్కడే ఉన్న ఉద్యానవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు కుటుంబసమేతంగా హాజరు అయ్యి స్వామి వారి మహా ప్రసాద వితరణలో పెద్ద ఎత్తున పాలొన్నారు. వెంకటరాజు మిగతా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
