సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ ; భీమవరం పట్టణంలోని 1, 4 వార్డులలో నేడు, బుధవారం జరిగిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం జగన్ అనేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ముందుగానే వాలంటీర్ల ద్వారా, ఆశ వర్కర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల ఆరోగ్య భద్రతపై నివేదికలు తయారుచేసి సురక్ష వైద్య శిబిరాలలో వారికి ఉచితంగా రక్త పరీక్షలు చేయడంతో పాటుగా ఈసీజీ, ఇతర పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. వైసిపి పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య మాట్లాడుతూ.. అవసరమైన వారికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. కంటి పరీక్షలు కూడా చేసి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు, ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, గూడూరి. ఉమాబాల,, కోడె యుగందర్. నల్లం రాంబాబు. పేరిచెర్ల సత్యనారాయణరాజు. చెల్లబోయిన సూర్యప్రకాష్, ముత్యాల రామారావు.అల్లూరి రాజేష్ రాజు కందికట్ల ఎడ్వర్డ్.నందమూరి ఆంజనేయులు బలే యేసుబాబు కోయ మణి తదితరులు పాల్గొన్నారు
