సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ అభ్యర్థులుగా పోటీగా బరిలో ఉన్న ఇద్దరు కీలక అభ్యర్థులు భీమవరం 3వ పట్టణానికి చెందినవారు కావడం యాదృచ్చికం..సామాన్య కుటుంబాల నుండి వచ్చి ఆర్థిక బలవంతులు కాకపోయిన 3 దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉండటం మరో విశేషం. వారి నివాసాల వద్దే ఇటీవల ఎంపీ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యడం మరో విశేషం. సంచలన రీతిలో సీఎం జగన్ ప్యూహం ప్రకారం ఎన్నికలకు 2 నెలలు ముందుగానే వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న గూడూరి ఉమాబాల ప్రచారంలో ఎవరు ఊహించని రీతిలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకొని గతంలో ఏ ఎంపీ అభ్యర్థి పర్యటించని రీతిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. జిల్లాలో 50 శాతం పైగా బీసీ ఓటర్లు ఉండటంతొలిసారి బీసీ MP అభ్యర్థిగా బరిలో దిగుతుండటం , మహిళా అభ్యర్థిగా బరిలో ఉండటం, దానికి తోడు ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఈసారి ఉండి నియోజకవర్గానికి పరిమితం అయ్యి ఎమ్మెల్యే పోటీ చేస్తుండటం ఆమెకు అనేక ప్లస్ పాయింట్స్ గా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భీమవరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ పంపన చంద్రశేఖర్ కుమార్తె గా, మాజీ కౌన్సిలర్ గా, లాయర్ గా,ద్వారకా చిన్న తిరుమల ట్రస్టీ గా వైసీపీ పార్టీ జిల్లా మహిళా అడ్జక్షురాలిగా గూడూరి ఉమాబాలకు ప్రత్యక బ్రాండ్ ఉంది. సీఎం జగన్ జిల్లాలో పలు ఎన్నికల సభలో ఆమెను ప్రజలకు తన సోదరిగా పరిచయం చేసారు. ఇక కూటమి బలపరచిన బీజేపీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గా బరిలో ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కు బీజేపీ పార్టీతో 3న్నర దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. జిల్లా బీజేపీ అడ్జక్షునిగా పలుమారులు పనిచేసిన అనుభవం అన్ని వర్గాల ప్రజలతో పరిచయాలు ఆయనకు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి.ఆయన స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులతో కలసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఢిల్ల్లీ స్థాయి కేంద్ర పెద్దలతో సుదీర్ఘ స్నేహం ఉంది. వారి సహకారంతో తాను భీమవరం మున్సిపల్ బీజేపీ కౌన్సిల్ లీడర్ గా , ప్యానల్ చైర్ పర్సన్ గా భీమవరం అబివృద్ధి కి కోట్లాది నిధులు మంజూరు చేయించడంలో ఆయన పాత్ర ఉంది. గతంలో 2 సార్లు నరసాపురం నుండి టీడీపీ సహకారంతో బీజేపీ తరపున ఇద్దరు ఎంపీలను గెలిపించడంలో వర్మ పాత్ర కూడా కీలకమైనదే.. ఇప్పటికే చంద్ర బాబు, పవన్ కల్యాన్‌లు జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించారు, మొన్న రాజమండ్రి సభలో శ్రీనివాస్ వర్మను నెగ్గిం చాలని ప్రధాని మోడీ స్వయంగా కోరారు. మరో వైపు మరింత జోష్ పెంచడానికి ఈనెల 11న అమిత్ షా భీమవరం రానున్నారు. రోడ్‌షో నిర్వహిస్తారు. అదికూడా శ్రీనివాస్ వర్మ గెలుపు కు ద్రోహదం చేస్తుందని ఆయన అభిమానులు కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఈసారి నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరిని విజేతగా ప్రకటిస్తారో చూడాలి..
