సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉదయం భీమవరం రెండవ పట్టణంలోని 32,33,34,35 వార్డులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రధాన రహదారులపై ఇరువురు కలసి ప్రజలకు అభివాదములు చేస్తూ కలసి ఓపెన్ టాప్ జిప్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న పోలింగ్ తేదీ రోజున అసెంబ్లీ మరియు లోక్ సభకుప్రతి ఒక్కరు తమ 2 ఓట్లు వైసీపీ పార్టీకి ఫ్యాను గుర్తుపై వెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. వారి వారి వార్డులలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి, విశాలమైన రోడ్డులు , సుందరీకరణ పనులు ప్రజలకు వివరించారు. ఉత్సహవంతులయిన పార్టీ మద్దతు దారులు వారి వాహనం ముందు బైక్ లపై దారి పొడవున స్వగతం పలికారు. ఈ ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే సోదరులు గ్రంధి బాలాజీ, పార్టీ పట్టణ కన్వీనర్ తోట భోగయ్య, రెండో పట్టణ జెసిఎస్ కన్వీనర్ ఏ ఎస్ రాజు, ముత్యాల బుజ్జి, కొప్పర్తి జనార్దన్, బొర్రా వాసు, పిప్పల నాని, కైలా పాండురంగారావు, రేవూరి గోగురాజు, అభిరుచి రఘు, కాంట్రాక్టర్ సుబ్బరాజు, కొల్లి ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,
