సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్టానిక డి.యన్.ఆర్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సెస్ వారిచే నేడు, శనివారం రామకృష్ణసభ భవనము నందు పాలిటెక్నిక్ ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల ఆటపాటలు కళా ప్రదర్శనలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్య నారాయణ రాజు (బాబు ) మాట్లాడుతూ .. విద్యార్ధులలో సృజనాత్మకత పోటితత్వం వివిధ రకాల నైపుణ్యాలను పెంపోందించుటకు ఇలాంటి వేడుకలు విద్యార్ధులకు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్ధుల్లో చదువుపరంగా మరియు ఎక్స్ ట్రా కర్కిక్యులర్ యక్టివిటిస్ లోను ఈ వేడుక ఒక నూతన ఉత్సాహాన్ని విద్యార్ధుల్లో రేకేత్తిస్తుందని అన్నారు విధ్యార్ధులకు కావలసిన సకల సౌఖర్యాలు కల్పించటం లో తమ కార్యవర్గం అహర్నిశలు శ్రమస్తున్నారని అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఏమ్. అంజన్ కుమార్ , మరియు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వి.యస్.వర్మ తదితరులు మాట్లాడుతూ తమ కళాశాలలో అత్యంత ఆధునికమైన ప్రయగశాలలు,అనుభవజ్ఞులైన సిబ్బింది, దూర ప్రాంతం నుంచి వచ్చే వారికీ, బస్సు సౌకర్యం, ఉచిత హాస్టల్ వసతి. మొరిటోరియాన్ విద్యార్ధులకు ఉపకార వేతనాలు, పాలీసెట్ ఎంట్రన్స్ టెస్ట్ కు ఉచిత శిక్షణ తరగతులు గత పది సంవత్సరాలు నుండి తమ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా పాలిటెక్నిక్ రెండొవ మూడోవ సంవత్సరాలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు డి.యన్.ఆర్ యాజమాన్యం చే నగదు ప్రోత్సాహాలు అందించారు
