సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి అనేక దశాబ్దాలుగా దేశంలో అన్ని రంగాలలో ఎందరో ప్రముఖులను అందించిన ఘన చరిత్ర ఉన్న దంతులూరి నారాయణరాజు కళాశాలకు NAAC బెంగుళూరు వారు A+ గుర్తింపు లభించింది. ప్రతిస్టాత్మక దంతులూరి నారాయణరాజు కళాశాల(అటానమస్ )కు నాల్గవ సైకిల్ క్రింద NAAC , బెంగుళూరు వారు A+ గ్రేడును ఇవ్వడం జరిగింది. ఈ నవంబర్ నెల 28 మరియు 29 తేదీలలో బెంగుళూరు కు చెందిన న్యాక్ పీర్ టీం కళాశాలను సందర్సించి ఈ గౌరవం ప్రకటించిన నేపథ్యంలో నేడు, శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు నరసింహరాజు, కార్యదర్శి, గాదిరాజు బాబు, వైస్ ప్రసిడెంట్ గోకరాజు పాండురంగ రాజు, కళాశాల ప్రిన్సిపాల్ మోజెస్, అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ పి.రామకృష్ణంరాజు లు మాట్లాడూతూ.. భారత్ స్వాతంత్య్రానికి ముందే 1945 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాల నాటి నుండి నేటి వరకూ శాఖోపశాఖలుగా విస్తరించిందని, విద్యార్ధులకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా లాభాపేక్ష లేకుండా ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో ని వివిధ జిల్లాల వారికి సహితం తక్కువ ఖర్చు తో ఉన్నత విద్యను అందిస్తున్నామని ఫీజుల రాయితీని అదేవిధంగా దివ్యాంగులకు ఫీజుల మినహాయింపును ఇస్తున్నామని అన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు నేటి టెక్నాలజీ లకు అవసరమైన అనేక ఆధునిక కోర్సులను ప్రవేశ పెడుతున్నామని, విద్యార్ధుల చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ..వివిధ ప్రఖ్యాత కంపెనీల యాజమాన్యాలతో సంప్రదించి ఎప్పటికప్పుడు క్యాంపస్ ఎంపికలు నిర్వహించి అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
