సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి యన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాన్ యస్ యస్ వాలంటీర్స్ చే కళాశాల దత్తత గ్రామ మైన యనమదుర్రులో నేడు, సోమవారంమేరీ మాటి మేరా దేశ్ (నా మట్టి- నా దేశం) కార్యక్రములో భాగంగాసుమారు 76 మొక్కలను నాటటం జరిగింది. ఈ కార్యక్రములో యనమదుర్రు గ్రామ సెక్రటరీ జి.కృష్ణ మోహన్ మాట్లాడుతు.. కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవ లో భాగంగా విద్యార్థులు మొక్కలను నాటారు. అంతేకాకుండా భూమిని మట్టి ని కలుష కోరలనుండి కాపాడి ప్రకృతి రమణీయతను కాపాడాలని దేశ భక్తి స్ఫూర్తి తో అందరూ మొక్కలను నాటాలని అన్నారు. యనమదుర్రు గ్రామ సర్పంచ్ బురబత్తుల శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల గౌరవార్థం వారు దేశం కోసం చేసిన సేవలు విద్యార్థులు స్ఫూర్తిగ తీసుకొని దేశ ప్రగతికి, అభివృద్ధి అహర్నిశలు కష్టపడాలని పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ యం. అంజాన్ కుమార్గారు మాట్లాడుతూ .. చెట్లు మనకు స్వచ్ఛమైన గాలి, నీరు మరియు ఆహారాన్ని అందిస్తాయి అని చెట్లు చాలా ముఖ్యమైనవి, విలువైనవి మరియు మన మనుగడకు అవసరమైనవి. ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు చేసే పనిలో శృజనాత్మకత మరియు పర్యావరణము మీద అవగాహన పెరు గుతుంది అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వి ప్రవీణ్ మాట్లాడుతూ ఆజాది కా అమృత మహోత్సవం ముగింపు సందర్భంగా ఈనెల 9 -నుంచి 15వ తారీకు వరకు మేరే మిట్టి మేరే దేశ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యాక్రములో డా.జి .జి రత్నం ,యాన్ యస్ యస్ వాలంటీర్స్,యమమదుర్రు గ్రామ సచివాలయం సిబంది పాల్గొన్నారు
