సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని ప్రతిష్టాకర విద్యాసంస్థ దంతులూరి నారాయణరాజు కళాశాల – పి.జి పరీక్ష ఫలితాలు ను నేడు, సోమవారం ఉదయం విడుదల చేసారు. కళాశాలలో పి.జి కోర్సెస్ రెండు మరియు నాల్గవ సెమిష్టర్ ఫలితాలను కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు , సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మరియు ఉప అధ్యక్షులు గోకరాజు పాండు రంగ రాజు విడుదల చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టి నేటి టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్దులను తర్పీదు ఇచ్చి వారికి తగిన అర్హత కలిగిన ఉద్యోగాలు కల్పించానికి కృషిచేస్తున్నామన్నారు. అదే విధంగా ఈ విద్యా సంవత్సరం నుండి బి.యస్.సి నర్సింగ్, బి.సి.ఎ, బి.బి.ఎ కోర్సు లను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ మాట్లాడుతూ ఈ రోజు విడుదల చేసిన పి.జి పరీక్ష ఫలితాలలో నాల్గవ సెమిష్టర్ లో 500 మంది హాజరు కాగా 467 మంది ఉత్తీర్ణత( 93 శాతం) సాధించారు అని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *