సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దంతులూరి నారాయణరాజు కళాశాలకు చెందిన విద్యార్దులు యల్.యన్.సి.టి యూనివర్సిటీ భోపాల్ లో జరిగిన ఆల్ ఇండియా అంతర్ యూనివర్శీటీల రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ లో 3 బంగారు పతకాలు రెండు రజిత పతకాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంతకుమారి తెలిపారు. కళాశాలలో పతకాలు సాధించిన విద్యార్దులకు అభినందన కార్యక్రమం జరిగింది. కళాశాల కార్యదర్సిమరియు కరస్పాండెంట్, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) మరియు కళాశాల వైస్ ప్రసిడెంట్, జి.పాండు రంగరాజు విద్యార్దులను అభినందించారు. నన్నయ్య యూనివర్శిటీ తరుపున మా కళాశాల విద్యార్దులు పై పోటీలలో పాల్గొని బహుతులు సాధించడం కళాశాలకు గర్వకారణం అని తెలిపారు. దేశం నలు మూలలనుండి 37 యూనివర్సీలు పాల్గోనగా మన యూనివర్సిటీకి 3 బంగారు పతకాలు 2 రజిత పతకాలు పురుషులకు అలాగే 1 రజిత పతకం మహిళలు సాధించారని అలాగే పురుషలు విభాగంలో టీంఛాంఫియన్ షిప్ లో రెండవ స్దానం సాధించడం చాలా ఆనందంగా ఉందని అలాగే మీకు కళాశాల తరపున సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల పిజికల్ డైరెక్టర్, రోప్ స్కిప్పింగ్ టీం కోచ్ గా వ్యవహరించిన డా.బి.వి.నరసింహరాజు కళాశాల ఎ.ఓ శ్రీ పి.రామకృష్ణం రాజు , పి.యిటి, జి.పి.సి. శేఖర్ రాజు మరియు విద్యార్దులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *