సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గ్రంధి శ్రీనివాస్ ఇంటి ముందు గత రాత్రి అయ్యప్ప స్వాములు భజన చేసి తమ నిరసన తెలియజేసారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉన్న కారణంగా బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి సభలు, సమావేశాలు జరుపుకోవాలన్న, గుంపులుగా కార్యక్రమాలు నిర్వహించకూడదని ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు స్థానిక సింహాద్రి అప్పన్న గుడివద్ద గత రాత్రి అయ్యప్ప భజన కు స్థానిక పోలీస్ అధికారులు అభ్యన్తరం వ్యక్తం చెయ్యడంతో వారు అక్కడి నుండి దగ్గరలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం గేటు బయట కూర్చుని అయ్యప్ప భజన చేస్తూ తమ నిరసన తెలిపారు. అక్కడ అయ్యప్పలు మీడియాతో మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్షలో వుండి ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో గత 28 సంవత్సరాలుగా తాము నిర్మించుకున్న సింహాద్రి అప్పన్న దేవాలయం దగ్గర ప్రతీ సంవత్సరం చేసుకుంటున్న అయ్యప్ప స్వాముల పడి పూజ పోలీస్ అధికారులు అడ్డుకున్నారని , ఈ పడిపూజ కార్యక్రమంకు ఇది 29వ సంవత్సరం. ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాటులూ చేసుకుని గురు స్వాములను పిలిచి షామియానా దింపుకొని స్వాములకు అల్పాహారం తయారు చేసుకున్నాక..జనసేన మద్దతు దారులు ఈ పడిపూజ నిర్వహిస్తున్నారనే కారణంతో ఈ పూజా కార్యక్రమం అధికారులు నిలిపి వేయడం స్వాములకు ఎంతో భాద కలిగించింది అని ఆరోపించారు. అయ్యప్ప పూజా కార్యక్రమం అధికారులు అనుమతి లేదని ఆపడం అమానుష చర్యగా స్వాములు ఆ స్వాములు పేర్కొన్నారు..
