సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణలోని ప్రతిష్టాకరమైన మునుగోడు ఉప ఎన్నికలో ఫలితాలు కౌంటింగ్ ఆలస్యం కావడంతో సాయంత్రానికి వెలువడ్డాయి. రాష్ట్రంలో అధికార టీఆరెస్ అభ్యర్థి కేప్రభాకర్ రెడ్డి 10వేల పైగా ఓట్ల ఆదిక్యటంతో సమీప బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫై విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. నేటి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాన పార్టీలకు పోలైన ఓట్ల లెక్క ఇది. టీఆర్ఎస్- 97,006 బీజేపీ- 86,697 కాంగ్రెస్-23,906 ఓట్లు సాధించాయి. దీనితో ఈ ఫలితం కోసం కమ్యూనిస్టులతో సైతం జత కట్టి సర్వము ఒడ్డి పోరాడిన మంత్రులు, టీఆరెస్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నారు. కేంద్రము లోని బీజేపీ కి కుట్రలకు ఇది మంచి గుణపాఠం అన్నారు మంత్రి కేటీఆర్.. ఇక ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో 100మంది టీఆరెస్ ఎమ్మెల్యేలు కౌరవుల నాపై పడి, అధికార బలంతో ఓడించారని , అయిన మెజారిటీ కేవలం 10వేలు మాత్రమే నని, ప్రజాబలం తనకే ఉందని తాను ఒడి గెలిచానని వ్యాఖ్యానించారు.
