సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు, శుక్రవారం ఉదయం టిడిపి నాయకులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధ అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాలతో ప్రతి శుక్రవారం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నామని ప్రజల నుండి వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సంప్రదించి న్యాయం చేకూరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
