సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జనానికి వెబ్ సిరీస్ ను మించి మంచి ట్విస్ట్ లు, యాక్షన్ , సెంటిమెంట్ లు కలగలిపిన రియల్ స్టోరీ మంచు ఫ్యామిలీ ఆస్థి పంపకాల ఇష్యులో లోతు తెలియదు కానీ..కుటుంబాన్ని పబ్లిక్ చెయ్యడంలో కాస్త తెలివిగా ప్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిగా మంచు మనోజ్ కనిపిస్తున్నాడు. దీనితో నటుడు మనోజ్ మంచుపై హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులను మంజూరు చేసింది. యూట్యూబ్ లేదా మరే ఇతర సోషల్ మీడియా లలో కూడా అన్నయ్య విష్ణు మంచు గురించి ఎలాంటి పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయకుండా మనోజ్ కు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. మంచు మనోజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో.. అది విష్ణు మంచుకు బాధ కలిగించిందని, అలాగే ఆయన ప్రతిష్టకు హాని కలిగేలా ఉన్నాయని, విష్ణు పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. విష్ణు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన సిటీ సివిల్ కోర్టు ఇక నుండి విష్ణు మంచు ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలను మనోజ్ మాట్లాడకూడదని ఒకవేళ ఆలా మాట్లాడితే చర్యలు తీసుకొంటామని తీర్పును ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *