సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు రాష్ట్రఉద్యోగ సంఘాలు మంగళవారం హాజరు అయ్యారు. చర్చలు సానుకూలంగా జరిగాయి. ఉద్యోగుల PRC, DA, మెడికల్ బిల్లుల తదితర సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ఉద్యోగ సంఘ నాయకులను ఆహ్వానించింది. ఇప్పటికేగత 90 రోజులుగా APJAC, అమరావతి ఆధ్వర్యంలో న్యాయమైన ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఉద్యమం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలు ముందుకు వచ్చి చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈరోజు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కీలక అంశాలు చర్చకు వచ్చాయని ప్రభుత్వం తప్పక మంచి చేస్తుందని భావిస్తున్నామని లేదంటే ఉద్యమం కొనసాగుతుందని JACచైర్మన్ బొప్పారాజు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగుల అడ్జక్షుడు ఎస్. కృష్ణమోహన్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ఫై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖలో పెండింగ్లో ఉన్న రూ. 511 కోట్ల బిల్లులను పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. CFMS ప్రకారం చెల్లించడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందన్నారు మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగుల పెండింగ్
బిల్స్ పై చర్చ జరిగింది. జీపీఎస్ విధానం పై ఉద్యోగ సంఘాలకి పవర్ పాయింట్ ద్వారా వివరించాం . పాత పెన్షన్ వల్ల కలిగే నష్టాలు…జిపిఎస్ ఉపయోగాలు వివరించాం. ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నాం అన్నారు.
