సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలలో మత్స్యపూరి, పంజావేమవరం గ్రామాలలో జనసేన క్రియాశీల సభ్యులు కొందరు గాయపడగా వారికి వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం పార్టీ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ చెక్కులు (50,000 మరియు ,34,000) రూ ను జిల్లా ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు వీరవాసరం మండల పార్టీ కార్యాలయం లో వారికి అందచేశారు. అనంతరం మండలంలో కొన్ని గ్రామ కమిటీలను నియమించి వాళ్ళకి నియామకపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పుప్పాల బాలాజి,నాయకులు బండి రమేష్ కుమార్, ఎంపీటీసీ లు విజయలక్ష్మీ, ఇందిరా,నాయకులు, మోపిదేవి విశ్వేశ్వరరావు,కార్యకర్తలు పాల్గొన్నారు.
