సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవలపశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల బెట్టింగ్ లో సుమారు 30 నుండి 40 కోట్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి జంప్ జిలాని అయ్యాడని పెద్ద ప్రచారం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తీవ్ర విషాదాలుగా ముగుస్తున్న నేపద్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బెట్టింగ్ వ్యసనం కోటీశ్వరులను క్షణాలలో బికారులుగా మార్చేసింది. కృష్ణాజిల్లా నూజివీడులోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి బెట్టింగ్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. 10 శాతం కమీషన్‌పై సుమారు రూ.30 కోట్ల వరకు సేకరించాడు. ఆ సొమ్ము మెుత్తాన్ని మరో పందెంలో పెట్టాడు. జూన్ 4న వైసీపీ ఘోర పరాజయం పొందడంతో అప్పట్నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో పందెం రాయుళ్లు అతణ్ని వెతకడం ప్రారంభించారు. నగదు చెల్లించలేక తన ఫార్మ్ హౌస్‌లో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు అని భావిస్తున్నారు. అయితే అతని వంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానస్వదా మృతిగా కేసు నమోదు చేసారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోనూ ఐదుగురు మధ్యవర్తుల వద్ద రూ.20 కోట్లు వరకు పెడితే వారు ఇప్పుడు అందుబాటులో లేరని బెట్టింగ్ రాయుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజగా .. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని రెంటపాళ్ల ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ వేశారు. ఓడిపోయి అందరికి నగదు చెల్లించి తీవ్రంగా నష్టపోవడంతో అయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఆ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 2019 ఎన్నికలలో కూడా టీడీపీ వారు ఎందరో కోట్లాది రూపాయలు, విలువైన పొలాలు కోల్పోయారు అందుకేఅందుకే అయాచితంగా వచ్చే డబ్బు కోసం బెట్టింగులు కు దూరంగా ఉండాలని కోరేది..
