సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నవ భారత నిర్మాత, భారతరత్న డా.బీ.ఆర్.అంబేద్కర్ గారి 66వ వర్థంతి సందర్భంగా భీమవరంలోని స్థానిక జనసేన కార్యాలయంలో నియోజవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు , నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భముగ, చినబాబు మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న కుల వివక్షతపై, అంటరానితనంపై పోరాడిన ధీరోధాత్తుడు డా.బి.ఆర్.అంబేద్కర్ అని తెలియజేశారు. ఆయన రచించిన రాజ్యాంగ చట్టాలే నియంతృత్వ ప్రభుత్వాలపై ప్రజలు పోరాడటానికి హక్కులకు రక్షణగా నిలిచాయని, … ఈ రాక్షస పాలన ఈ ప్రభుత్వంలో మనం కనీసం బ్రతుకుతున్నాం అంటే ఆ మహనీయుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఉంది కాబట్టి మనం బ్రతక కలుగుతున్నామని అని ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. . ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్ర శేఖర్, భీమవరం మండల అధ్యక్షుడు మోకా శ్రీనివాస్, పట్టణ సెక్రటరీ సుంకర రవి, సెక్రటరీ కత్తుల నీలేంద్ర,నాయకులు ,MpTC లు తాతపూడి రాంబాబు, మాజీ కౌన్సిలర్ వానపల్లి సూరిబాబు నాయకులు, బండి రమేష్ కుమార్ , చెన్ను శేషు ,పుప్పాల సుబ్బారావు, ఆకుల శ్రీను ,పంతం ప్రసాద్, కాళీ శేఖర్, కొప్పినిడి బాబి, త్రివిక్రమ్,, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
