సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు పూర్తీ అయ్యాయి. మరో ప్రక్క శుభ ముహుర్తాలు ఇంకో ప్రక్క దీపావళి పండుగ సీజన్ మొదలు కానుంది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నశనివారం విజయదశమి రోజున భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, నేటి, ఆదివారం కూడా బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో నేడు (అక్టోబర్ 13న) ఉదయం దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 40 పెరిగి రూ. 76,430కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 70,061కు చేరింది. దీంతో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,160కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 69,813కి చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 76,420కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 70,052 స్థాయికి చేరింది. మరోవైపు ఇటీవల బాగా తగ్గిన వెండి ధర నేడు, ఆదివారం కిలోకు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే పెరిగి 91, 840రూపాయలకు లభ్యం అవుతుంది.
