సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో వైసీపీ నేతల ఫై కొత్త కొత్త కేసులు, అరెస్ట్ ల తరువాత మరో కొత్త కేసులు నమోదు అయ్యి అరెస్ట్ కావడం జరుగుతూనే ఉంది. తాజగా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్త రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతడి సోదరుడు, అనుచరుడు మూకుమ్మడి దాడి చేసారని కొత్త కేసు నమోదు కావడంతో గత ఆదివారం సాయంత్రం అరెస్ట్ అయ్యిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విచారించడానికి మంగళగిరి కోర్టు 14 రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నందిగం సురేష్‌ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే గతంలో పలు కేసులలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం బెయిల్‌పై ఉన్నారు. ఈరోజు (సోమవారం) ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టులో మాజీ ఎంపీని పోలీసులు హాజరుపర్చగాకోర్టు రిమాండ్ విధించింది.
