సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం జాతిపిత , మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా భీమవరం పురపాలక సంఘం నందు భారీ గాంధీ మహాత్ముని కాంస్య విగ్రహానికి మునిసిపల్ సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా మునిసిపల్ కమీషనర్ కె.రామచంద్రా రెడ్డి , మునిసిపల్ ఇంజనీర్ త్రినాధ్ రావు, రెవిన్యూ ఆఫీసర్ రంగారావు తదితరులు పూలమాలలు వేసి తదుపరి మాట్లాడుతూ. అహింస పరమోధర్మః , అన్న సూక్తిని దేశ స్వతంత్ర సమరంలో సైతం ఆచరణ లో చూపిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని, భవిషత్తు తరాల శాంతి సౌభాగ్యాల కోసం ఆయన చూపిన మార్గం ఆచరణనీయం అన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *