సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఉదయం 7 గంటల నుండి దేశంలోని మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక జార్ఖండ్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్, ఉత్తరప్రదేశ్‌లో కొన్ని స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్ర కన్నా జార్ఖండ్ ప్రజలు ఎక్కువ సంఖ్యా లో ఓట్లు వెసందుకు ఉదయం నుండే భారీ క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ తారలు, ప్రముఖ క్రికెటర్లు, నేతలు క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ తమ కుటుంబ సమేతంగా వచ్చి ఓట్లు వేశారు.
