సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుండి మహాశివరాత్రి వేడుకలలో భాగంగా శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు దేవాలయ ఇఓ ఎం అరుణ్ కుమార్, సిగ్మా న్యూస్ కు తెలిపారు. ఈ ఉత్సవాలు 16వ తేదీ నుండి 20వ తేదీవరకు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ కోడె విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక దాతలు, స్వామి భక్తులు సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని, ప్రకటించారు. చలువ పందిళ్ళ అలంకరణలు, లైటింగ్ సెట్టింగ్స్ ప్రారంభించామని గతంలో కన్నా ఎక్కువ మంది భక్తులు ఎంతో దూరప్రాంతాల నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో , వాహనాలలో వేలాదిగా తరలి వస్తారని భావిస్తున్నామని .. వారికీ వేగంగా స్వామివారి దర్శనం అయ్యేందుకు, వాహన పార్కింగ్ కు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాలయంలో నిత్యా అన్నసమారాధన తో పాటు ఈ 5 రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాలలో పాల్గొనే భక్తుల కోసం , కార్యక్రమాల నిర్వాహకుల కోసం ప్రత్యేక మహా ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. 18వ తేదీ మహాశివరాత్రి వేడుకలు 19వ తేదీ రధోత్సవం 20 వ తేదీ తెప్పోత్సవం కు అన్ని జాగ్రత్తలు తో స్థానిక పోలీస్ అధికారుల సహకారంతో నిర్వహిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *