సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా హాలీవుడ్ స్థాయిలో జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని ఈ సినిమా బడ్జెట్ రూ. 1500 కోట్లు అంటూ వచ్చే పిబ్రవరి లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. బాహుబలి సిరీస్, RRR సినిమాలతో తెలుగు సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి చేర్చిన రాజమౌళి ఇకపై హాలీవుడ్ సినిమాల రికార్డు వేల కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టే సినిమా ను అన్ని ప్రపంచ స్థాయి హంగులతో , హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి ఎంపికైనట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాల్లోనటిస్తోన్న నటి ఎలిజబెత్ చెల్సియా ఇస్లాన్ను తీసుకుంటున్నట్లు సమాచారం . ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ తో పాటు లొకేషన్ స్కౌటింగ్,షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *