సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి అప్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో వచ్చే జూన్ నెల ఆరో తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు గత గురువారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. మాచెర్ల లో ఒక పోలింగ్ బూత్ లో కూటమి వర్గీయులు రింగింగ్ చేస్తున్నారని వారిని నిరోధించాలని ఎన్ని విజ్ఞప్తులు, ఫొన్లు చేసిన అధికారులు పట్టించుకోలేదని కోపంతో పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను ధ్వంసం చేసి ఉండవచ్చునని.. వైసీపీ నేతలు భావిస్తున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని మీడియా ప్రచారం జరిగింది. దీంతో కోర్టు వద్ద పోలీసులు మోహరించారు. అయిన, పిన్నెల్లి అచూకీ పోలీసులకు లభించలేదు. ఆయనను తెలంగాణలో అరెస్టు చేశారని వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. పిన్నెల్లి ఏవిఎం లను నేలకేసి కొట్టిన పిర్యాదు నమోదు చెయ్యని పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన పీవో, ఏపీవోలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అయితే ఏపీ హైకోర్టు మాత్రం తాజగా .. పిన్నెల్లి తో సహా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరిపైనా వచ్చే నెల ఆరో తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చెయ్యడం గమనార్హం.
