సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి చంద్రబాబు వివరాలుతెలుసుకున్నారు. తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు చెప్పారని.. ఆయన కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వివరించారని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తిరిగి ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
