సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క బీహారు లో ఎన్నికలు జరుగుతున్నా వేళా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఎన్నికల కమిషన్ ఫై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను ఆధారాలతో సహా నిరూపించిన ఓట్ల చోరీపై ఇప్పటివరకు బీజేపీ, ఈసీ స్పందించలేదని తెలిపారు. ఇప్పటి వరకు ‘ఓట్ల చోరీ’తోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని ఆరోపించారు. ఓట్ల చోరీపై తమ దగ్గర ఇంకా చాలా సమాచారం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో కూడా ఇదే తరహా ఓట్ల చోరీ ఘటన పునరావృతం కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, గుజరాత్‌లోనూ ఇదే జరిగిందని ఆరోపించారు. ఓట్ల చోరీపై బీజేపీ తప్పు చేసిన దొంగలా ఆత్మరక్షణలో పడిందే తప్ప తన ఆధారాలను ఎక్కడ వ్యతిరేకించట్లేదని చెప్పారు. బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ ఆరోపణలను ఈసీ కూడా ఖండించింది. బీహారు ఓటర్లు జాబితాలపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఈసీ స్పష్టం చేసింది
