సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మే 2023లో ప్రభుత్వం2000 రూపాయల నోట్లను వ్యవస్థ నుండి పూర్తిగా నిలిపివేసింది..2000 రూపాయల నోట్లను నిషేధించి దాదాపు రెండు సంవత్సరాలు అయింది.అయితే 2000 రూపాయల నోట్లలో రెండు శాతం కంటే తక్కువ ఇప్పటికీ మార్కెట్లో చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. ఈ రెండు వేల రూపాయల నోట్లకు ఎటువంటి విలువ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం సామాన్యులు భారత దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2000 నోట్లను ఆర్బీఐ ఏ కార్యాలయానికైనా పంపి తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చును అని తాజాగా ప్రకటించింది.అప్పుడు యధాతధంగా డబ్బు రూపంలో రెండు వేల రూపాయల నోటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. 2,000 నోట్లలో 98.18 శాతం తిరిగి తమకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రకటించింది. ఆయితే ఇప్పుడు ప్రజల వద్ద కేవలం రూ.6,471 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఉన్నాయి
