సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మరో 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లోకి అనేక బాషలలో వరల్డ్ వైడ్ సినిమాగా రాబోతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో 500 కోట్ల పైగా భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా కల్కిని చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.. గత రాత్రి ముంబై లో కల్కి ప్రీ రిలీజ్‌ను ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించింది మూవీ టీం. ఈ వెంట్లో టాలీవుడ్ స్టార్, హ్యాండ్సమ్ హాంక్ రానా దగ్గుబాటి సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. ముందుగా ఇద్దరు గ్రేటెస్ట్ లెజెండరీస్ అమితాబ్, కమల్ ల తో నటించిన అవకాశం వచ్చింది. . వారితో కలిసి నటించే అవకాశం రావడమంటే ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. సెట్లో అమితాబ్ ని కలిసినప్పుడు కాళ్లకు దండం పెట్టబోతుంటే.. నువ్వు నా కాళ్లకు పెడితే.. నేను నీ కాళ్లకు దండం పెడతా అన్నారు. ఆయన అలా అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు. ఆయనో పెద్ద స్టార్. ముఖ్యంగా సౌత్‌లో అంతా అమితాబ్ గారి హెయిర్ స్టైల్, హైట్ గురించే మాట్లాడుకునేవారు. సౌత్ ఎవరైన ఏంటీ నువ్వు ఏం అయినా అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నావా? హైట్ గురించి వస్తే అమితాబ్ గారితో పోల్చేవారు. ఇక కమల్ సర్ కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి జుబ్బా డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి డ్రెస్ లోపల క్లాత్ చుట్టుకొని ఆయనలా నటించేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్. అలాగే దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్” అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కల్కి లో పేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఎంత చెయ్యాలో అంత చేశాం అన్నారు ప్రభాస్.. ఇంత భారీ సినిమా తీసిన అశ్వనీదత్ కు అమితాబ్ పాదాభివందనం చెయ్యడానికి ప్రయత్నించడం హైలైట్ గా నిలచింది. అతిధి మర్యాదలకు భీమవరం బ్రాండ్ ప్రభాస్ ఇంటి నుండి భారీ క్యారేజీ తో తెచ్చి అన్ని రకాల ఐటమ్స్ తో పుడ్ వడ్డించడం ఫై దీపికా, అమితాబ్ సరదాగా వివరించారు.
