సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమల లో శ్రీవారి దర్శనం కోసం లక్షమంది పైగా భక్తులు తెల్లవారు జామునుండే క్యూ లైన్ లలో నిల్చుని శ్రీవారి దర్శనం చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో నేటి శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు గారు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తి ప్రవర్తులతో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ పవిత్ర ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ స్వామి వారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్రా ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని శ్రీవారిని ప్రార్దించానని మోషేను రాజు పేర్కొన్నారు.
