సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లాలో నేడు, సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్టకూటి పనుల చేసుకొనే మహిళాలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందటం జరిగింది. ప్రమాదంలో గాయపడినవారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు
