సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అందరు ఊహించినట్లే.. నేటి మంగళవారం ఉదయం నుండి జరుగుతున్నా ఓట్ల కౌంటింగ్ లో కూటమిలోని మేయర్, చైర్ పర్సెన్ అభ్యర్థులు ‘వన్ సైడ్ వార్‘ తీరున విజయం సాధిస్తున్నారు. పలు కార్పొరేషన్లలో ‘కూటమి’ మేయర్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (టీడీపీ), ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన) ముందంజలో ఉన్నారు. విశాఖపట్నంలో ముక్కా శ్రావణి (టీడీపీ), విజయనగరంలో అవనాపు భార్గవి (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక చిత్తూరులో కటారి హేమలత (టీడీపీ), తిరుపతిలో జేబీ శ్రీనివాస్ (టీడీపీ) ముందంజలో దూసుకుపోతున్నారు. భారీ వర్షాలు మరో ప్రక్క విజయవాడలో కౌంటింగ్ హాలులో గందరగోళం నెలకొంది. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి AB వెంకటేశ్వర రావు దీనిపై ఎన్నికల కమిషన్ కు పిర్యదు చేసారు. గుంటూరులో కూడా కౌంటింగ్ హాలులో గందర గోళం నెలకొంది. పలు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులకు మెజారిటీ ఓట్లు రావడం గమనార్హం. జరిగిన పరిణామాలుతో ఫలితాలు ముందే ఉహించి మునిసిపల్ ఎన్నికలలో తన ఓటు హక్కు కూడా వినియోగించకుండా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపిన మాజీ సీఎం జగన్ తరహాలోనే చాల చోట్ల కౌంటింగ్ కు వైసీపీ ఏజెంట్స్ కూడా దూరంగా ఉన్నారని సమాచారం. అయితే చిత్రంగా సీఎం చంద్రబాబు స్వంత నియోజక వర్గం కుప్పం పరిధిలోని మున్సిపాలిటీ లో కొందరు వైసీపీ అభ్యర్థులు కౌన్సెలర్స్ గా ముందంజలో ఉండి మెరుపులు మెరిపిస్తునారు.
