సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో 87 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక ప్రక్క భారీ వర్షాలు మరో ప్రక్క కౌంటింగ్ హాలు లో కూటమి, వైసీపీ పోలింగ్ ఏజెంట్స్ మధ్య దూకుడు, అభ్యన్తరాలు, గందరకొళం తో నేటి మంగళవారం రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం మేయర్ అభ్యర్థి వైసీపీ ముందంజ లో ఉంటె మరో 2 చోట్ల వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటము మినహాయిస్తే అన్ని మున్సిపాలిటీల్లోనూ కూటమి ఆధిక్యం కొనసాగుతోంది.. అన్ని ప్రాంతాలలో వార్డు కౌన్సిలర్ స్థానాలలో మాత్రం వైసీపీ అభ్యర్థులు కూడా గౌరవపదమైన గెలుపులతో తమ ఉనికి చాటుకొన్నారు. ఎక్కువ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే 30పైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అధికారికంగా కూటమి ఖాతాలోకి చేరాయి.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.. . పులివెందుల లో అక్రమాలు జరిగాయని రి పోలింగ్ .పెట్టాలని వై యస్ జగన్ చేసిన విజ్ఞప్తి ని ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో అక్కడ కౌంటింగ్ నిర్వహించగా .. టీడీపీ అభ్యర్థి గీతా కుమారి తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రమీలమ్మపై 13వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 40 వార్డుల్లో 37 వార్డులలో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా వైసీపీ కేవలం మూడు చోట్లే విజయం సాధించింది.అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయవాడ మేయర్ ఎన్నికల ఫలితాలు నేటి అర్ధరాత్రి కి కానీ వెలువడవు.
