సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేటి బుధవారం మే డే రోజు నుండి పలు బ్యాంకులకు చెందిన క్రిడెట్ కార్డు లావాదేవీలలో పలు మార్పులు జరిగాయని వినియోగదారులు గమనించాలి. ఇకపై ఎస్ బ్యాం క్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే విద్యుతు బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది .దీంతో పాటు మీరు ఆయా బ్యాంకుల క్రెడిట్ కార్డ్ లను వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పైర్డ్ రూ.15,000, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఫై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే పైన పేర్కొ న్న వన్ (ఒకశాతం) పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీ ని సైతం చెల్లించాలి.
