సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీహార్ విజయం ఎన్డీయే దే అని ఊహించారు కానీ ఇంతటి ఘనవిజయం అని ఊహించలేకపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 203 స్థానాలలో భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వ ఏర్పాట్లు చేసుకోవడానికి మంచి జోష్ లో ఉన్నారు. కాంగ్రెస్ మరియు RJD కూటమి కేవలం 33 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉంది. అయితే ఈ హేమాహేమీల మధ్య ఎన్డీయే లో భాగస్వామ పార్టీ .. ఓ యువ కెరటం కూడా బలంగా తన ఉనికిని చాటుకుంది. తాజా ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ దాదాపు 22 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాలనూ ఈ పార్టీ గెలుచుకుంది. దేశంలో సుప్రసిద్ధ ప్రముఖ రాజకీయ ప్యూహా కర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ఊసులో లేకుండా పోయింది. ఇక భారతదేశంలో ప్రధాని మోడీ చరిష్మా కు తిరుగులేదని బీహార్ ఎన్నికలు చాటి చెప్పాయి.
