సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న 23వ ఆసియాన్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ట్రంప్ అక్కడ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. నేడు మంగళవారం ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో క్వాడ్ దేశాల కూటమి నేతలైన భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంతొనీ ఆల్బనీస్, జపాన్ ప్రధాని టకాయిచీతో కలిసి ట్రంప్ మరో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటో దిగే సమయంలో మోదీ చాలా టఫ్ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం మూడు రోజుల ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తరువాత చైనాలో కూడా పర్యటిస్తారు. అక్కడ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *