సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం సీనియర్ హీరో మోహన్ బాబు కుటుంబ నేపథ్యంలో.. సోదరులు ఇరువురి మధ్య గత కొంత కాలంగా రగడ జరుగుతున్న విషయం మీడియాలో అప్పుడపుడు రచ్చ జరుగుతున్నా విషయం తెలిసిందే.. అయితే నేడు, ఆదివారం మంచు మనోజ్ ఫై తండ్రి మోహన్ బాబు సన్నిహితులు వెళ్లి దాడి చేసారని వార్తలు రావడం .. నేటి మధ్యాహ్నం మనోజ్ కాలికి గాయం అయ్యిందని హాస్పటల్ లో చేరటం మీడియా లో మంచి బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. అయితే ఆ కాసేపటికే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తరపు నుండి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదనేలా ఓ వార్త వచ్చింది. కానీ, మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి దాడి చేయించినట్లుగా మీడియా ముందు ప్రవర్తిస్తూనే .. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు మంచు మనోజ్ నుండి 100కు కాల్ వచ్చినట్లుగా పోలీసులు కూడా ధ్రువీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో మంచు ఫ్యామిలీలో రగడ నిజమేఅని తేలింది. అయితే ఇక్కడ మంచు మనోజ్ రభస చేస్తున్నాడు తప్పితే.. మోహన్ బాబు సైడ్ నుండి కొంచెం అంటే కొంచెం కూడా కదలిక లేదు. పైగా ఈ సమయంలో ట్విట్టర్ ఎక్స్‌లో ఆయన తన పాత చిత్రాలలో పాత్రలపై తన అనుభవాలు పోస్ట్ లు పెడుతున్నారు. అసలు నిజంగా దాడి జరిగిందా? ఒక ప్రక్క అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య పుష్ప డైలాగ్స్ వార్ నడుస్తుంటే.. మరో ప్రక్క మంచు ఫ్యామిలి రచ్చ దేనికోసమో? ఆస్తుల కోసం కుటుంబ తగాదాల? అయితే ఇటీవల కాలంలో శ్రీ విద్య నీకేతన్ కాలేజీ లో పోరాడుతున్న స్టూడెంట్స్ కువారి తల్లి తండ్రులకు మద్దతుగా మంచు మనోజ్ నిలబడిన విషయం గమనార్హం.
