సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎవరైనా స్వీట్స్ పార్సిల్ పంపిస్తారు.. లేక ఇష్టమైన వస్తువులు గృహోపకరణాలు పార్సిల్ పంపిస్తారు.. అయితే డెడ్ బాడీ ఎవరైనా పార్సిల్ గా పంపిస్తారా? పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి లో ఓ మహిళా ఇంటికి వచ్చిన పార్సిల్ ఆమెతో పాటు స్థానికులతో భయాందోళనలు కలిగించింది. యండగండిలో జగనన్న కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మిస్తున్న సాగి తులసి అనే మహిళకు నిన్న గురువారం ఈ పార్సిల్ వచ్చింది. ఈ పార్సిల్ రాజమండ్రి క్షత్రియ పరిషత్ నుంచి వచ్చినట్లు సమాచారం. సాగి తులసి నిర్మిస్తున్న ఇంటికి పార్శిల్‌లో విద్యుత్ సామాగ్రి పంపిస్తున్నామని క్షత్రియ పరిషత్ నిర్వాహకులు తెలిపారు. ఆ మహిళకు ఆ పార్సిల్ ను ఓ ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అతను తులసికు ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు వచ్చాయని ఫోన్ చేసి తెలపడంతో ఆమె ఆ పార్సిల్ తీసుకోని గత గురువారం ఉదయం తెరచి చూడగా అందులో వ్యక్తి మృతదేహం చూసి భయపడి పోయింది. అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ పార్సిల్‌ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు పార్సిల్ తెచ్చిన సదరు వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *