సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేసిన ఘటనలో యువతి పరిస్థితి విషమయంగా మారటం తో సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆమెను బెంగుళూర్ లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. జీవితంలో ఎన్నో ఆశలు తో ఉన్న ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసిన‘ఉన్మాది’ కూడా పురుగుల మందు తాగటంలో మదనపల్లి ఆసుపత్రిలో చేర్చారు. ఇక రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిందితునిపై కఠిన చర్యలకు ఆదేశించారు బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. బాధితురాలి తండ్రి జనార్ధన్‌కు మంత్రి లోకేష్ ఫోన్ చేసి పరామరసించి ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం.. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను’’ అని మంత్రి భరోసా ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
