సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ నెలల విరామం తరువాత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోనసీమలో రేపు సోమవారం నుంచి పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో నారా లోకేశ్ నేటి, ఆదివారం సాయంత్రమే అక్కడికి చేరుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్ లోని తమ నివాసం నుండి తండ్రి అస్సిసులు తీసుకోని బయలు దేరారు. రేపటి నుంచి రాజోలు నియోజకవర్గం నుండి మొదలు కానున్న లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో టీడీపీ, జనసేన శ్రేణులు ఉమ్మడిగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్యాడర్ సమీకరణ చేస్తున్నారు. మొదటి రోజు పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 9న పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. మరో ప్రక్క తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబు రేపు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సిదార్ధ లూథ్రా కుమారుని వివాహం నేడు ఆదివారం, రిసెప్షన్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఈ రిసెప్షన్‌కు హాజరు కానన్నారు. మంగళవారం (28వ తేదీ) వరకు చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారు. అదే రోజు మంగళవారం ఢిల్లీ లోని సుప్రీం కోర్టులో చంద్రబాబు కు ఇటీవల హైకోర్టు బెయిల్ ఇస్తూ తన పరిధిని సుప్రీం కోర్ట్ నియమాలను అతిక్రమించి వ్యాఖ్యలు చేసిందని ఆ బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ఫై సుప్రీం కోర్ట్ లో విచారణ జరుగుతుంది.
