సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సుదీర్ఘ విరామం తరువాత నేటి, సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు క్షమించాలన్నారు. గత పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని.. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హామీలు ఇచ్చానన్నారు. సీఎం జగన్ చేస్తున్న దోపిడీ భయటపెట్టానని చెప్పారు. తనకు భయపడి పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే సైకో జగన్ అడ్డుకోవడానికి స్కెచ్‌లు వేశారన్నారు. సైకో జగన్‌కు ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్.. సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని డైలాగ్స్ మరోసారి తనదయిన ధోరిణిలో వినిపించారు నారా లోకేష్.. అయితే గతంలోలా జగన్ నుద్దేశించి ఏమి? పికుంటాడో..పీక్కో .. అనే పదం వాడకపోవడం గమనార్హం..
