సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో తాజగా కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో దేశంలో యువత పెళ్లి చేసుకొనే వయస్సు ఫై ఆసక్తికర విషయాలు నివేదించింది. ఈ ఆధునిక జీవన శైలి లో సుఖాలు పెరిగిపోయాయి. ఆ సుఖాలు కోసం సంపాదన కష్టాలు, టెంక్షన్ లు మరింత పెరిగాయి. యువత కు ముందు బ్రతుకు తెరువు కీలకం. కనీసం నెలకు 40 వేలు సంపాదించలేక పొతే భార్యను ఎలా పోషించుకోవాలి ? తరువాత పిల్లలను చదివించుకోవాలంటే? ఆ పీజులు కట్టాలంటే? అందుకే గతంలో అమ్మాయికి 20, అబ్బాయికి 25 ఏళ్లు రాగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తల్లి తండ్రులు ఎంత ఒత్తిడి చేసినా అందుకే పెళ్లి చేసుకోవాలంటే కనీసం 30 ఏళ్లు దాటాలన్న మాట వినిపిస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ప్రతి వంద మంది యువతలో 26 మంది ప్రస్తుతం 30 ఏళ్లు దాటిన తరువాత పెళ్లి చేసుకుంటున్నట్టు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ఉందని పేర్కొంది.
