సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ .”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత తెలుగు, తమిళంలో వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం లభించలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. ఈ సినిమాను ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నేతృత్వంలోని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది.ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *