సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమలాపురం మండలంలోని, వన్నె చింతలపూడి గ్రామంలో నేటి ఆదివారం ఉదయం ‘క్షత్రియ సేవా సమితి’ వారు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కు ఘన సన్మానం నిర్వహించారు. చేతిలో ఖడ్గము పెట్టి , తలపై తలపాగా, శాలువా కప్పి రాజమర్యాదలతో ఘన సన్మానం చేసారు. దీనికి కోనసీమలోని క్షత్రియ వర్గాలు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. . ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ జి ఎం హర్ష బాలయోగి మరియు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మరియు చైతన్య యూనివర్సిటీ ఛాన్సలర్ సత్యనారాయణ రాజు క్షత్రియ సేవా సమితి సభ్యులు, స్థానిక కూటమి నాయకులు, మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
