సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతానికి బిన్నంగా గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నెలలో కూడా ఎన్నడూ లేని విధంగా చలి గాలులు (Cold ) ప్రజలను వణికిస్తున్నాయి. డిసెంబర్ చివరలో గోదావరి జిల్లాలు, ఉత్తరాంద్ర లోను ఉదయం 10 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇటీవల చూసాము. అయితే సాధారణంగా ప్రతి ఏడాది జనవరి మొదట్లో కొద్ది రోజులపాటు 12 డిగ్రీల మేర పైన్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇందుకు భిన్నంగా గత గత 3వారాల నుండి చీకటి పడగానే మంచు కురుస్తున్నది. ఉదయం 7న్నర వరకు సూర్య వెలుగు జాడ కనపడటం లేదు. చీకటిగానే ఉంటుంది. సాయంత్రం 4గంటల నుంచే చలి మొదలవుతుండడంతో భీమవరం లో సైతం మంచు కురుస్తుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు స్వెటర్లు ధరించి బయటకి వస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతోపాటు చిన్నారులు జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వాతావరణ ప్రభావంతో 5ఏళ్ళు చిన్నారులలో నిమోనియో వ్యాపిస్తున్నదని తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు.
